అన్నమయ్య కీర్తన అతి దుష్టుడ నే నలుసుడను - Telugu - రావణ - శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు - భారత స్వాతంత్ర్య దినోత్సవం | BhaktiGranth: A Library Of Vedas, Stotrams, & Devotional Literature
16

అన్నమయ్య కీర్తన అతి దుష్టుడ నే నలుసుడను - శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు


అతిదుష్టుడ నే నలసుడను ।
యితరవివేకం బికనేల ॥

ఎక్కడ నెన్నిట యేమి సేసితినొ
నిక్కపుదప్పులు నేరములు ।
గక్కన నిన్నిట కలిగిననీవే
దిక్కుగాక మరి దిక్కేది ॥

ఘోరపుబాపము కోట్లసంఖ్యలు
చేరువ నివె నాచేసినివి ।
నీరసునకు నిటు నీకృప నాకిక
కూరిమి నా యెడ గుణమేది ॥

యెఱిగి చేసినది యెఱుగక చేసిన-
కొఱతలు నాయెడ గోటులివే ।
వెఱపు దీర్చి శ్రీవేంకటేశ కావు
మఱవక నాగతి మఱి యేది ॥