అన్నమయ్య కీర్తన దేవ యీ తగవు తీర్చవయ్యా - Telugu - రావణ - శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు - భారత స్వాతంత్ర్య దినోత్సవం | BhaktiGranth: A Library Of Vedas, Stotrams, & Devotional Literature
16

అన్నమయ్య కీర్తన దేవ యీ తగవు తీర్చవయ్యా - శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు


దేవ యీ తగవు దీర్చవయ్యా
వేవేలకు నిది విన్నపమయ్యా ॥

తనువున బొడమినతతి నింద్రియములు
పొనిగి యెక్కడికి బోవునయా ।
పెనగి తల్లికడ బిడ్డలు భువిలో
యెనగొని యెక్కడి కేగుదురయ్యా ॥

పొడుగుచు మనమున బొడమిన యాసలు
అదన నెక్కడికి నరుగునయా ।
వొదుగుచు జలములనుండు మత్స్యములు
పదపడి యేగతి బాసీనయ్యా ॥

లలి నొకటొకటికి లంకెలు నివే
అలరుచు నేమని యందునయా ।
బలు శ్రీవేంకటపతి నాయాత్మను
గలిగితి వెక్కడి కలుషములయ్యా ॥