అన్నమయ్య కీర్తన అంతర్యామి అలసితి - Telugu - రావణ - శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు - భారత స్వాతంత్ర్య దినోత్సవం | BhaktiGranth: A Library Of Vedas, Stotrams, & Devotional Literature
16

అన్నమయ్య కీర్తన అంతర్యామి అలసితి - శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు


రాగం: ఆభోగి
ఆ: స రి2 గ2 మ1 ద2 స
అవ: స ద2 మ1 గ2 రి2 స
తాళం: ఆది

పల్లవి
అంతర్యామి అలసితి సొలసితి ।
ఇంతట నీ శరణిదె జొచ్చితిని ॥ (1.5)

చరణం 1
కోరిన కోర్కులు కోయని కట్లు
తీరవు నీవవి తెంచక । (2)
భారపు బగ్గాలు పాప పుణ్యములు
నేరుపుల బోనీవు నీవు వద్దనక ॥ (1.5)
అంతర్యామి అలసితి సొలసితి ।
ఇంతట నీ శరణిదె జొచ్చితిని ॥ (1.5)

చరణం 2
జనుల సంగముల జక్క రోగములు
విను విడువవు నీవు విడిపించక ।
వినయపు దైన్యము విడువని కర్మము
చనదది నీవిటు శాంతపరచక ॥

చరణం 3
మదిలో చింతలు మైలలు మణుగులు
వదలవు నీవవి వద్దనక । (2)
ఎదుటనె శ్రీ వెంకటేశ్వర నీవదె
అదన గాచితివి అట్టిట్టనక ॥ (1.5)
అంతర్యామి అలసితి సొలసితి ।
ఇంతట నీ శరణిదె జొచ్చితిని ॥ (1.5)