శ్రీ గణనాథం భజామ్యహం - Telugu - శ్రీ రామ కీర్తనలు | BhaktiGranth: A Library Of Vedas, Stotrams, & Devotional Literature
16

శ్రీ గణనాథం భజామ్యహం - శ్రీ రామ కీర్తనలు

రాగం: కనకాంగి (1 కనకాంగి మేళ)
తాళం: ఆది

పల్లవి
శ్రీ గణ నాథం భజామ్యహం
శ్రీకరం చింతితార్థ ఫలదం

అనుపల్లవి
శ్రీ గురు గుహాగ్రజం అగ్ర పూజ్యం
శ్రీ కంఠాత్మజం శ్రిత సామ్రాజ్యం (శ్రీ)

చరనం
రంజిత నాటక రంగ తోషణం
శింజిత వర మణి-మయ భూషణం
1ఆంజనేయావతారం 2సుభాషణం
కుంజర ముఖం త్యాగరాజ పోషణం (శ్రీ)