అన్నమయ్య కీర్తన నారాయణాచ్యుత - Telugu - రావణ - శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు - భారత స్వాతంత్ర్య దినోత్సవం | BhaktiGranth: A Library Of Vedas, Stotrams, & Devotional Literature
16

అన్నమయ్య కీర్తన నారాయణాచ్యుత - శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు


రాగం: మాళవి
ఆ: స రి2 గ3 మ1 ప మ1 ద2 ని2 స
అవ: స ని2 ద2 ప మ1 గ3 మ1 రి2 స
తాళం: ఆది

పల్లవి
నారాయణాచ్యుతానంత గోవింద హరి ।
సారముగ నీకు నే శరణంటిని ॥ (2)

చరణం 1
చలువయును వేడియును నటల సంసారంబు
తొలకు సుఖమొకవేళ దుఃఖమొకవేళ । (2)
ఫలములివె యీ రెండు పాపములు పుణ్యములు
పులుపు దీపును గలపి భుజియించినట్లు ॥ (2)
నారాయణాచ్యుతానంత గోవింద హరి..(ప..)

చరణం 2
పగలు రాత్రులరీతి బహుజన్మ మరణాలు
తగుమేను పొడచూపు తనుదానె తొలగు । (2)
నగియించు నొకవేళ నలగించు నొకవేళ
వొగరు కారపు విడెము ఉబ్బించినట్లు ॥ (2)
నారాయణాచ్యుతానంత గోవింద హరి..(ప..)

చరణం 3
ఇహము పరమును వలెనె యెదిటికల్లయు నిజము
విహరించు భ్రాంతియును విభ్రాంతియును మతిని । (2)
సహజ శ్రీ వేంకటేశ్వర నన్ను కరుణింప
బహువిధంబుల నన్ను పాలించవే ॥ (2)
నారాయణాచ్యుతానంత గోవింద హరి
సారముగ నీకు నే శరణంటిని ॥ (2)