అన్నమయ్య కీర్తన హరి యవతార మితడు - Telugu - రావణ - శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు - భారత స్వాతంత్ర్య దినోత్సవం | BhaktiGranth: A Library Of Vedas, Stotrams, & Devotional Literature
16

అన్నమయ్య కీర్తన హరి యవతార మితడు - శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు


హరి యవతార మీతడు అన్నమయ్య ।
అరయ మా గురుడీతడు అన్నమయ్య ।

వైకుంఠ నాథుని వద్ద వడి పడు చున్న వాడు
ఆకరమై తాళ్ళపాక అన్నమయ్య ।
ఆకసపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్న వాడు
ఆకడీకడ తాళ్ళపాక అన్నమయ్య ॥

ఈవల సంసార లీల ఇందిరేశుతో నున్న వాడు
ఆవటించి తాళ్ళపాక అన్నమయ్య ।
భావింప శ్రీ వేంకటేశు పదములందే యున్నవాడు
హావ భావమై తాళ్ళపాక అన్నమయ్య ॥

క్షీరాబ్ధిశాయి బట్టి సేవింపుచు నున్నవాడు
ఆరితేరి తాళ్ళపాక అన్నమయ్య ।
ధీరుడై సూర్యమండల తేజము వద్ద నున్నవాడు
ఆరీతుల తాళ్ళపాక అన్నమయ్య ॥